రాష్ట్రం లోనే కోదాడ పశువైద్య సేవలు ఆదర్శనీయం

Sakshitha news

రాష్ట్రం లోనే కోదాడ పశువైద్య సేవలు ఆదర్శనీయం

  • డా పి పెంటయ్య అంకితభావానికి లేదు కొలమానం
  • ⁠డా బి సుబ్బారాయుడు, రాష్ట్ర పశువైద్య మరియు పశు సంవర్ధక శాఖ అదనపు డైరెక్టర్

  • సూర్యాపేట జిల్లా/కోదాడ సాక్షిత : కోదాడ పట్టణం ప్రాంతీయ పశువైద్యశాలను సందర్శించిన రాష్ట్ర పశువైద్య మరియు పశు సంవర్ధక శాఖ అదనపు డైరెక్టర్ డా బి సుబ్బారాయుడు, పశువైద్యశాలలో అందుతున్న వినూత్న పశువైద్య సేవలు, అన్ని రకాల శస్త్ర చికిత్సలు, పరిధి తో సంబంధం లేకుండా ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుండి వస్తున్న జంతువులకు సైతం లక్షలు ఖర్చయ్యే ఆపరేషన్లను సైతం ఉచితంగా నిర్వహిస్తున్న అసిస్టెంట్ డైరెక్టర్ డా పి పెంటయ్య సేవలు మాటల్లో చెప్పలేమని ఇంతటి అంకిత భావం జంతు ప్రేమ రైతు పక్షపాతి గుణాలు అత్యంత అరుదైన తన సేవలు యువ పశువైద్యులందరికీ ఆచరణీయం అని ప్రతీ వ్యక్తికీ జీవితం లో నేను ఇది చేశాను అని చెప్పుకోవడానికి ఏదో ఒక ముఖ్య లక్ష్యసాధన ఉంటుందనీ కానీ డా పి పెంటయ్య ఎక్కడ పని చేసినా అక్కడ తన ప్రత్యేక ముద్ర వేస్తూ ప్రజలలో డిపార్ట్మెంట్ కి మంచి గుర్తింపు తెస్తున్నారని కొనియాడారు.

  • దేశంలోనే తొలిసారిగా పశుపోషకులకోసం నిర్వహిస్తున్న పశు ఔషధ బ్యాంక్ కోసం అదనపు సమయం కేటాయిస్తూ అధిక శ్రమకోర్చి కూడా. రైతులకు 20 కోట్ల పైన అదనపు ఆదాయం సృష్టించడం తనకే సాధ్యమైందని అన్నారు.
    ఆసుపత్రి ఆవరణలో భవిష్యత్ లో రైతులకు ఉచితంగా పశుగ్రాస విత్తనాలు గడ్డి కణుపులు సరఫరాకోసం పెంచుతున్న పశుగ్రాస క్షేత్రాన్ని తిలకించి అభినందించారు. సంకల్పం గొప్పదైతే పంచ భూతాలు సైతం అండగా ఉండి సహాయం చేస్తాయనీ అదే విధంగా పశుగ్రాస క్షేత్రానికి ఫెన్సింగ్ కోసం పౌల్ట్రీ యజమాని కిరణ్ ముందుకు రావడం అలాంటియసహాయమే అన్నారు.
    ఒక సూపర్ స్పెషాలిటీ పశువైద్యశాలలో అందించే అద్భుత సర్జరీలు నిర్వహిస్తున్న ఈ వైద్య శాలకు నూతన పక్కా భవనం ఆవశ్యకత ఎంతైనా ఉందని స్థానిక ప్రజా ప్రతినిధుల సహకారంతో కొత్త భవన నిర్మారాణానికి కృషి చేయాలని సూచించారు.

    కార్యక్రమములో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డా సిరిపురపు సురేంద్ర, సిబ్బంది బడేటి శివ, కొండా సాయికృష్ణ, కాంపాటి చంద్రకళ, సాగర్ పాల్గొన్నారు