20 లక్షలతో డైవర్షన్ రహదారి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే జారె
అశ్వారావుపేట నియోజకవర్గం ములకలపల్లి మండలం
మూకమామిడి మొగరాలగుప్ప గ్రామాల మధ్య ఉన్న హై లెవెల్ వంతెన ఇటీవల మురసు తుఫాన్ ప్రభావంతో తీవ్రంగా దెబ్బతిని ధ్వంసమైంది దీంతో వంతెన అవతలి గ్రామాల ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో గౌరవ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ గారు వెంటనే స్పందించి ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల నిధులు కేటాయించి తాత్కాలిక డైవర్షన్ రహదారి నిర్మాణానికి చర్యలు చేపట్టి పనులను ప్రారంభించారు
రెండు మూడు రోజుల్లో డైవర్షన్ రహదారి నిర్మాణం పూర్తి చేసి వంతెన అవతలి గ్రామాలకు రాకపోకలు పునరుద్ధరించాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా పనులను వేగంగా పూర్తి చేయాలని సూచించారు


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST
