అభివృద్ధిలో దూసుకుపోతున్న శేరిలింగంపల్లి డివిజన్.. వరద నీటికి శాశ్వత చెక్.. తారానగర్ ముస్లిం గ్రేవ్ యార్డ్ నుండి లింగంపల్లి విలేజ్ సెవెన్ హిల్స్ బిల్డింగ్ వరకు నూతన స్ట్రామ్ వాటర్ డ్రైన్.. పనులను పర్యవేక్షించిన శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ .
శేరిలింగంపల్లి డివిజన్… తారానగర్ ముస్లిం స్మశాన వాటిక నుండి లింగంపల్లి విలేజ్ మెయిన్ రోడ్డు సెవెన్ హిల్స్ బిల్డింగ్ వరకు సుమారుగా రూ. 3.10 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నూతనంగా చేపట్టబోయే నాలా విస్తీర్ణంలో భాగంగా స్ట్రామ్ వాటర్ డ్రైన్ పనులను శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ సిఎంసి ఇంజనీరింగ్ విభాగం డిఈ ఆనంద్ మరియు ఏఈ భాస్కర్ లతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా డ్రైన్ నిర్మాణానికి సంబంధించిన మార్గం, నాణ్యతా ప్రమాణాలు, పనులను వేగవంతంగా పూర్తి చేసే అంశాలపై అధికారులతో చర్చించి పలు సూచనలు చేశారు. వర్షాకాలంలో స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న ముంపు సమస్యకు ఈ డ్రైన్ నిర్మాణం శాశ్వత పరిష్కారం చూపుతుందని తెలిపారు.
అనంతరం లింగంపల్లి విలేజ్, వెంకట్ రెడ్డి కాలనీలో నెలకొన్న పలు సమస్యలపై స్థానిక వాసులు కార్పొరేటర్ గారిని విన్నవించుకోగా వారు తక్షణమే స్పందించి సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.
కార్పొరేటర్ మాట్లాడుతూ… శేరిలింగంపల్లి డివిజన్ అభివృద్ధే ధ్యేయంగా నిరంతరం కృషి చేస్తున్నామని.. ప్రజలకు మౌలిక వసతులు కల్పించడంలో ఎలాంటి రాజీ ఉండదని అన్నారు. తారానగర్ ముస్లిం స్మశాన వాటిక నుండి లింగంపల్లి విలేజ్ మెయిన్ రోడ్డు 7 హిల్స్ బిల్డింగ్ వరకు చేపట్టబోయే ఈ రూ. 3.10 కోట్ల డ్రైన్ పనుల వల్ల దీర్ఘకాలికంగా ఉన్న వరద నీటి సమస్య తొలగిపోతుందని.. పనులను నాణ్యతతో నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ గౌరవ అధ్యక్షులు వీరేశం గౌడ్, జయంత్ కుమార్ సార్, SLVDC ప్రెసిడెంట్ గడ్డం రవి యాదవ్, జ్ఞానేశ్వర్, శ్రీనివాస్, అజీమ్, కృష్ణ, సురేష్ రాథోడ్, అందెల కిరణ్, రఘు యాదవ్, భరత్ గౌడ్, రేవంత్, ఈశ్వర్ స్థానికవాసులు తదితరులు పాల్గొన్నారు.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST
