తెలుగు తల్లి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఉచిత హెల్త్ క్యాంపు

Sakshitha news

292 డివిజన్, సాయిబాబా నగర్ పరిధిలోని తెలుగు తల్లి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో వారి కమ్యూనిటీ హాల్ లో ఉచిత హెల్త్ క్యాంపు నిర్వహించడం జరిగింది.

తెలుగు తల్లి నగర్ అధ్యక్షులు తారా సింగ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా BRS సీనియర్ నాయకులు వారాల వినోద్ కుమార్ పాల్గొనడం జరిగింది.

ఈ సందర్భంగా వారాల వినోద్ కుమార్ మాట్లాడుతూ, ఇలాంటి మంచి కార్యక్రమాలు నిర్వహించినందుకు కమిటీ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ప్రజల ఆరోగ్యం కోసం ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా సంతోషకరమని వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో BRS నాయకులు రాజ్ కుమార్ ముదిరాజ్, తారా సింగ్, కరాటే శీను, నారాయణ, బద్రి, లక్ష్మణ్, జహీర్, కాసా రాధాకృష్ణ తో పాటు పెద్ద సంఖ్యలో బస్తీ వాసులు, నాయకులు పాల్గొనడం జరిగింది.