మూడు రోజులే గడువు.. MLC ఓటర్ నమోదుపై ఆనందన్న సమీక్ష!

Sakshitha news

మూడు రోజులే గడువు.. MLC ఓటర్ నమోదుపై ఆనందన్న సమీక్ష!

మర్పల్లి మండలం పట్లూర్ గ్రామంలో నిర్వహించిన పట్టభద్రుల MLC ఓటర్ నమోదు సమీక్ష కార్యక్రమంలో వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. MLC ఓటర్ నమోదు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని BRS పార్టీ నాయకులకు సూచించారు. ఓటర్ నమోదు కోసం ఇంకా మూడు రోజులు మాత్రమే సమయం ఉన్నందున, ఈ మూడు రోజుల్లో అత్యధిక సంఖ్యలో పట్టభద్రులు నమోదు చేసుకునేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

అనంతరం మర్పల్లి మండలం తుమ్మలపల్లి గ్రామంలో BRS పార్టీ ముఖ్య నాయకులతో సమావేశమై, పార్టీ బలోపేతం, గ్రామస్థాయిలో పార్టీ కార్యకలాపాల విస్తరణతో పాటు పట్టభద్రుల MLC ఓటర్ నమోదు పురోగతిపై చర్చించారు.

ప్రతి గ్రామంలోని అర్హులైన పట్టభద్రులు MLC ఓటర్లుగా నమోదు చేసుకునేలా ప్రత్యేక దృష్టి సారించాలని, గ్రామాల వారీగా ఇంచార్జీలకు బాధ్యతలు అప్పగించి నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు.