షీ టీమ్స్, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్‌ఐ మల్లేష్
మహిళల భద్రతపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం..
సూర్యాపేట జిల్లా / కోదాడ నవంబర్ సాక్షిత :
మహిళలు, విద్యార్థినుల భద్రతకు పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోందని కోదాడ సబ్ డివిజన్ షీ టీమ్స్ ఎస్‌ఐ మల్లేష్ తెలిపారు. జిల్లా ఎస్పీ కె. నరసింహ, ఐపీఎస్ ఆదేశాల మేరకు, అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి సూచనలతో, కోదాడ డీఎస్పీ శ్రీనివాస రెడ్డి ఆధ్వర్యంలో నయానగర్‌లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో షీ టీమ్స్, సైబర్ నేరాలు, మహిళల భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్‌ఐ మల్లేష్ మాట్లాడుతూ.. మహిళల రక్షణ కోసం జిల్లా పోలీస్ శాఖ పటిష్టంగా పనిచేస్తోందని తెలిపారు. విద్యార్థులు తమకు ఎదురయ్యే సమస్యలను ఉపాధ్యాయులు, పోలీసు అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. ప్రతి ఒక్కరూ మానసిక ధైర్యాన్ని కలిగి ఉండాలని, అనుకూల, ప్రతికూల పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేలా అవగాహన పెంచుకోవాలని అన్నారు. తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చే బాధ్యత విద్యార్థులపై ఉందని గుర్తుచేశారు.
ఇంటర్నెట్‌ను సద్వినియోగం చేసుకోవాలని, సైబర్ నేరగాళ్ల వలలో పడి మోసపోవద్దని హెచ్చరించారు. వ్యక్తిగత వివరాలు, బ్యాంకు ఖాతా, ఏటీఎం కార్డు, ఓటీపీ వివరాలను ఇతరులకు వెల్లడించకూడదని సూచించారు. గుర్తుతెలియని వ్యక్తులు ఇచ్చే ఆశలకు ఆకర్షితులు కావద్దని, మెసేజ్‌ల ద్వారా వచ్చే అనుమానాస్పద లింకులను క్లిక్ చేసి వ్యక్తిగత వివరాలు నమోదు చేయవద్దని తెలిపారు.
మహిళలు, విద్యార్థినుల రక్షణకు సంబంధించిన చట్టాలు, వేధింపులను ఎదుర్కొనే విధానాలు, సోషల్ మీడియా వినియోగం, ఇంటర్నెట్ భద్రత తదితర అంశాలపై అవగాహన కల్పించారు. …షీ టీమ్స్, సైబర్ నేరాలు, మహిళల భద్రతా పై అవగాహన
మహిళల, విద్యార్థులు రక్షణ చట్టాలు, విద్యా విధానాలు, సమస్యలను అధిగమించడం, సోషల్ మీడియా, ఇంటర్నెట్ సద్వినియోగం లాంటి అంశాలపై అవగాహన కల్పించారు. విద్యార్థులు వత్తిడిని అధిగమించి లక్ష్యాలను చేరుకోవాలి, లక్ష్యం కోసం కృషి చేయాలని తెలిపినారు.
సైబర్ మోసాలపై 1930 టోల్ ఫ్రీ నంబర్ కు పిర్యాదు చేయాలని అన్నారు. అలాగే వేధింపులపై 112 కు సమాచారం ఇవ్వాలని తెలిపినారు.
ఈ కార్యక్రమం నందు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ వెంకటనారాయణ , హెడ్ కానిస్టేబుల్ రామయ్యా,కానిస్టేబుల్ నాగేంద్ర బాబు, మహిళా కానిస్టేబుల్ సౌజన్య, పాఠశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST
