ప్రజా సమస్యల పరిష్కారానికి కూన శ్రీశైలం గౌడ్ ప్రత్యేక చొరవ

Sakshitha news

ప్రజా సమస్యల పరిష్కారానికి కూన శ్రీశైలం గౌడ్ ప్రత్యేక చొరవ – తాగునీటి బోర్ల మంజూరుకు, 22-A జాబితా నుంచి కాలనీల తొలగింపునకు కలెక్టర్ సానుకూల హామీ

చింతల్‌లోని రిడ్జ్ టవర్స్ వాసులు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యను మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ గారి దృష్టికి తీసుకురాగా, ఆయన వెంటనే స్పందించారు. కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులను వెంటబెట్టుకొని జిల్లా కలెక్టర్ మనో చౌదరి గారిని కలిసి సమస్యను వివరించారు. కాలనీలో నూతన బోర్లు మంజూరు చేసి తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరారు. దీనిపై కలెక్టర్ సానుకూలంగా స్పందిస్తూ నూతన బోర్ల ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

అదేవిధంగా రంగారెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని విజయనగర్, మారుతి నగర్ కాలనీలకు చెందిన సుమారు 400 కుటుంబాలు ఎదుర్కొంటున్న 22-A నిషేధిత జాబితా సమస్యను కూడా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ జాబితాలో చేర్చడం వల్ల ఇళ్ల రిజిస్ట్రేషన్లు, ప్లాట్ల క్రయవిక్రయాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని వివరించి, సంబంధిత భూములను 22-A జాబితా నుంచి తొలగించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సమస్యపై కలెక్టర్ స్పందిస్తూ, పూర్తి వివరాలను పరిశీలించి రెవెన్యూ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారం కోసం నిరంతరం కృషి చేయడమే తన లక్ష్యమని కూన శ్రీశైలం గౌడ్ పేర్కొన్నారు. ప్రజలకు మౌలిక సదుపాయాలు, ఆస్తుల రిజిస్ట్రేషన్ సమస్యల నుంచి విముక్తి కల్పించే వరకు తన వంతు కృషి కొనసాగిస్తానని భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో కొంపల్లి మాజీ సర్పంచ్ జిమ్మిదేవేందర్, బుచ్చిరెడ్డి, మోతే శ్రీనివాస్ యాదవ్, కూన రాఘవేంద్ర గౌడ్, రిడ్జ్ టవర్స్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు జనార్దన్ రెడ్డి, మల్లికార్జున్ రెడ్డి, సురేష్, పవన్, చక్రి, రమేష్ బాబు, రంగా రెడ్డి నగర్ డివిజన్ కి చెందిన షకీర్, ప్రభాకర్ రెడ్డి,మల్లం శీను, తదితరులు పాల్గొన్నారు..