చిన్నకంజర్లలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్

Sakshitha news

చిన్నకంజర్లలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్..

పటాన్చెరు

ఇంద్రేశం మున్సిపల్ పరిధిలోని చిన్నకంజర్ల గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వర్షాకాలం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం ఉదయం పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ప్రభుత్వం తరఫున కొనుగోలు కేంద్రాలలో అందిస్తున్న వసతులను రైతులను అడిగి తెలుసుకున్నారు. రైతులు తమ ధాన్యాన్ని దళారులకు విక్రయించవద్దని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం. కొనుగోలు చేసిన ధాన్యానికి నిర్ణీత గడువులోగా డబ్బులు చెల్లించాలని కోరారు. రైతులకు బకాయి పడిన బోనస్ అంశంలో రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రను వీడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ప్రమీల, డిసిసిబి డైరెక్టర్ రాఘవేందర్ రెడ్డి, సీనియర్ నాయకులు వెంకట్ రెడ్డి, అంతిరెడ్డి, శ్రీనివాస్, రామచందర్, వెంకటేష్, పిఎసిఎస్ డైరెక్టర్లు, రైతులు పాల్గొన్నారు