దర్గా షరీఫ్ ఉర్స్ ఉత్సవాలు ఘనంగా.. ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్
▪️చింతల్: 128వ చింతల్ డివిజన్ పరిధిలోని దర్గా షరీఫ్‌లో హజ్రత్ జిందా షాహ్ మదార్ (రహ్మతుల్లా అలైహి) ఉర్స్-ఏ-షరీఫ్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
▪️ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ ముందుగా ఉర్సు శుభాకాంక్షలు తెలియపరుస్తూ అన్ని మతాల ప్రజలు పరస్పర గౌరవం, సోదరభావం, మతసామరస్యంతో కలిసి మెలిసి జీవించాలని ఆకాంక్షించారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు…
▪️ఈ కార్యక్రమంలో మసీదు కమిటీ నిర్వాహకులు రషీద్, ఖదీర్, రియాజ్, బాబు మియా, షాకీర్, మోతే శ్రీనివాస్ యాదవ్, రమేష్ మంజూల్కర్, ఆర్వ వెంకట్,శంకర్ గౌడ్, నవాజ్, రాజు తదితరులు పాల్గొన్నారు..


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST
