ఢిల్లీలో ఇండియా కూటమి పోరుబాట.. మంత్రి పొంగులేటి, ఎంపీ రఘురాంరెడ్డి హాజరు
- సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్
- కాసేపట్లో భారీ ర్యాలీగా.. రామ్‌లీలా మైదానానికి వెళ్లేందుకు సిద్ధం
న్యూఢిల్లీ: ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను నిరసిస్తూ, కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఇండియా కూటమి ఆదివారం నిర్వహిస్తున్న మెగా ర్యాలీకి రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి హాజరయ్యేందుకు ముందస్తుగానే ఢిల్లీ చేరుకున్నారు.ర్యాలీలో పాల్గొనేందుకు కొద్దిసేపటి కిందట న్యూఢిల్లీలోని బీకేఎస్ మార్గ్‌లో ఉన్న ఎంపీ క్వార్టర్స్ నుంచి మింటో రోడ్–కనాట్ ప్లేస్ కూడలికి బయలుదేరారు. అక్కడి నుంచి ఇండియా కూటమి నేతలు, కార్యకర్తలతో కలిసి భారీ ప్రదర్శనగా రామ్‌లీలా మైదానానికి చేరుకోనున్నారు. అనంతరం అక్కడ నిర్వహించే బహిరంగ సభలో పాల్గొననున్నారు.
ఈ కార్యక్రమంలో టీజీఐడీసీ మాజీ చైర్మన్ మువ్వా విజయబాబు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు తుళ్లూరు బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST
