బండారి లేఔట్లో రూ.25 లక్షల CMC నిధులతో సీసీ రోడ్డు ప్రారంభించిన కొలన్ హన్మంత్ రెడ్డి ||*
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 275వ డివిజన్ నిజాంపేట్ పరిధిలోని బండారి లేఔట్, RGK 55 బ్లాక్లో CMC నిధులు రూ.25 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డును కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు.
ఈ సందర్భంగా కొలన్ హన్మంత్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. స్థానిక ప్రజలకు రాకపోకల్లో ఇబ్బందులు లేకుండా నాణ్యమైన రహదారుల నిర్మాణానికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. CMC నిధులతో చేపట్టిన ఈ అభివృద్ధి పనులు స్థానిక ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు కొలన్ శ్రీనివాస్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు విరగని వాసు, బొమ్ము వెంకటేశ్వర రెడ్డి, సిద్ధనోళ్ల సంజీవ రెడ్డి, ఆలేటి శ్రీనివాస్, రఫాత్, సరళ లక్ష్మన్న, ప్రభాకర్ రెడ్డి, రామ్ చందర్ నాయక్, విజయ్, రాజు, ఆటో శీను, గౌస్, బాలకృష్ణ, కుమార్, వైకుంఠరావు బాయ్, రామానాయుడు, నయా, అబ్దుల్లా, రషీద్, మొయినుద్దీన్, రవి, రవి నాయక్, శేషు, వెంకటేష్, మూర్తి, చారి, మార్తమ్మ తదితరులు పాల్గొన్నారు.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST
