చలో ఢిల్లీ కార్యక్రమానికి బయలుదేరిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్
కుత్బుల్లాపూర్: ఏఐసీసీ పిలుపు మేరకు నవంబర్ 1న ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో నిర్వహించనున్న ‘ఓట్ బచావో – దేశ్ బచావో’ భారీ నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు కుత్బుల్లాపూర్ మాజీ శాసనసభ్యులు, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ శంషాబాద్ విమానాశ్రయం నుండి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.
ఆయనతో పాటు కార్పొరేషన్ చైర్మన్లు బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి , మెట్టు సాయి కుమార్ , గడ్డి అన్నారం మార్కెట్ చైర్మన్ మధుసూదన్ రెడ్డి తదితరులు ఢిల్లీకి బయలుదేరారు.
దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు, ఓటు హక్కు కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఈ ఉద్యమంలో భాగంగా ఢిల్లీలో నిర్వహించనున్న భారీ నిరసన కార్యక్రమంలో వారు పాల్గొననున్నారు.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST
