292 సాయిబాబా నగర్ డివిజన్ – సూరారం కాలనీ మైత్రి నగర్ లో మంజీరా పైప్ లైన్ లీకేజీ సమస్యకు పరిష్కారం
292 సాయిబాబా నగర్ డివిజన్, సూరారం కాలనీ, మైత్రి నగర్ లో గత వారం రోజులుగా మంజీరా పైప్ లైన్ వాల్ లీకేజీ సమస్యతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఈ విషయాన్ని మైత్రి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు BRS సీనియర్ నాయకులు వారాల వినోద్ కుమార్ దృష్టికి తీసుకురావడం జరిగింది.
వెంటనే స్పందించిన వారాల వినోద్ కుమార్ సంబంధిత వాటర్ వర్క్స్ అధికారులతో మాట్లాడి, చొరవ తీసుకొని లీకేజీ సమస్యను ఈరోజు పరిష్కరించడం జరిగింది.
సమస్య పరిష్కరించినందుకు మైత్రి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు గట్టు అశోక్ రాజు యాదవ్ మరియు అసోసియేషన్ సభ్యులు వారాల వినోద్ కుమార్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST