పాలేరు నియోజకవర్గం
పట్టభద్రుల ఓటరు నమోదు సన్నాహక సమావేశం పట్టభద్రుల ఓట్ల నమోదు పై ప్రత్యేక దృష్టి పెట్టాలి
పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయమే లక్ష్యంగా ప్రతి నాయకుడు, కార్యకర్త సమన్వయంతో పనిచేయాలి
కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ ramreddysarvotham.com వెబ్సైటు లో ఫారం -6 దరఖాస్తులు రిజిష్టర్ చేసుకునేలా ప్రచారం చేయాలి
వరంగల్–నల్గొండ–ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు కార్యక్రమంపై పాలేరులో ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన
రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి * నల్గొండ–ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల శాసనమండలి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర రైతు కమిషన్ సభ్యులు రామ్ రెడ్డి గోపాల్ రెడ్డి * తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ యువజన నాయకులు రామ్ రెడ్డి శ్రీ చరణ్ రెడ్డి డిసిసి అధ్యక్షులు నూతి సత్యనారాయణ గారు
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అర్హత కలిగిన పట్టభద్రులందరూ తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకునేలా క్షేత్రస్థాయిలో పనిచేయాలని నాయకులకు సూచించారు. ప్రతి మండలంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి అర్హులైన పట్టభద్రులను గుర్తించి, వెంటనే ఓటరు నమోదు చేయాలనీ అన్నారు.
కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ ramreddysarvotham.com వెబ్సైటు లో ఫారం -6 దరఖాస్తులు రిజిష్టర్ చేసుకునేలా ప్రచారం చేయాలనీ అన్నారు.
యువత సమస్యలపై అవగాహన కలిగిన యువ నాయకుడిగా రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి కి మద్దతుగా నిలవాలని, గ్రాడ్యుయేట్లను చైతన్యపరిచి ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములను చేయాలని తెలిపారు.
నవంబర్ 6వ తేదీలోపు అర్హులైన ప్రతి గ్రాడ్యుయేట్ తమ ఓటును నమోదు చేసుకోవాలని, అర్హత కలిగిన పట్టభద్రులు ఎవరూ ఓటు నమోదు చేసుకునే అవకాశాన్ని కోల్పోకూడదని తెలిపారు. ఓటు నమోదు ప్రక్రియలో ప్రతి ఒక్కరూ చురుగ్గా పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని . యువత అభివృద్ధి, విద్యావంతుల సమస్యల పరిష్కారం, ప్రజాస్వామ్య భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు కీలకమైనవని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ప్రకటించిన ఎమ్మెల్సీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి గెలుపునకు అందరూ కృషి చేయాలని.ఈ కార్యక్రమంలో , కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు పోతు భాస్కర్, , తెలంగాణ వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు, పాలేరు నియోజకవర్గ నాయకులు, మండల, బ్లాక్, పట్టణ, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు, సర్పంచులు, కౌన్సిలర్లు, యూత్ కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST