గుడ్లవల్లేరు మండలంలో కూటమి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము
చినగొన్నూరు సీతారామాలయంలో పూజలతో ప్రచారం ప్రారంభం….
పురిటిపాడు, తాడిచర్ల, కట్టవాని చెరువు, చింతలగుంట, సేరిదగ్గుమిల్లిలో ప్రచార రథంపై పర్యటన…
గ్లాసు గుర్తుకు, సైకిల్ గుర్తుకు ఓటేసి కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి
గ్రామాల్లో ‘చెప్పాం.. చేస్తున్నాం’ కరపత్రాల పంపిణీ..
ప్రతి గ్రామంలో అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నాం, ఐక్యంగా ముందుకు సాగుతున్నాం:ఎమ్మెల్యే రాము
జీరో అయిపోయిన ప్రతిపక్షాలకు ఈ ఎన్నికల్లో డిపాజిట్లు కూడా దక్కవు…
గుడ్లవల్లేరు : గుడివాడ నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి ఎమ్మెల్యే వెనిగండ్ల రాము శ్రీకారం చుట్టారు. కూటమి నేతలు, శ్రేణులతో కలిసి గుడ్లవల్లేరు మండలంలో సోమవారం విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేపట్టారు.
మండలంలోని చినగొన్నూరులోని శ్రీ సీతారామాలయంలో జనసేన జడ్పీటీసీ అభ్యర్థి వర్రె బలరామకృష్ణ, ఎంపీటీసీ అభ్యర్థులతో కలిసి ఎమ్మెల్యే రాము స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచారాన్ని ప్రారంభించారు. ముందుగా మండలంలో పోటీ చేస్తున్న కూటమి ఎంపీటీసీ అభ్యర్థులకు ఎమ్మెల్యే రాము అభినందనలు తెలిపారు.
అనంతరం పురిటిపాడు, తాడిచర్ల, కట్టవాని చెరువు, చింతలగుంట, సేరిదగ్గుమిల్లి గ్రామాల్లో ప్రచార రథంపై పర్యటించారు. జడ్పీటీసీ అభ్యర్థి బలరామకృష్ణకు, ఎంపీటీసీ అభ్యర్థి కాగిత ఉమాకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు.
గ్రామాల్లో పర్యటిస్తూ గ్లాసు గుర్తుపై ఓటు వేసి జడ్పీటీసీగా బలరామకృష్ణను, సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఎంపీటీసీగా ఉమాను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు అభివాదం చేస్తూ విజ్ఞప్తి చేశారు. ‘చెప్పాం.. చేస్తున్నాం’ కరపత్రాలను పంపిణీ చేస్తూ కూటమి ప్రభుత్వ పాలనలో మండలంలో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించారు. ప్రచారంలో భాగంగా తమ గ్రామాలకు వచ్చిన ఎమ్మెల్యే రాము, కూటమి అభ్యర్థులకు మహిళలు హారతులు ఇచ్చి ఘనంగా స్వాగతం పలికారు.
వివిధ గ్రామాల్లో నిర్వహించిన సభల్లో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మాట్లాడుతూ…..కార్యకర్తలందరి ఏకాభిప్రాయంతో ప్రతి చోట మంచి, సమర్థులైన అభ్యర్థులను ఎంపిక చేశామని, గత రెండున్నరేళ్లలో నియోజకవర్గంలో అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామన్నారు.
ఈ అభివృద్ధి మరింత వేగంగా ముందుకు సాగాలంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని, జడ్పీటీసీగా జనసేన అభ్యర్థి బలరామకృష్ణను, ఎంపీటీసీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
నియోజకవర్గ వ్యాప్తంగా చిన్నపాటి విభేదాలు కూడా లేకుండా కూటమి ఐక్యంగా ముందుకు సాగుతోందని, ఎక్కడైనా సమస్యలు ఉంటే నేరుగా తన వద్దకు రావాలని, వాటిని వెంటనే పరిష్కరిస్తామన్నారు. ప్రతి గ్రామంలో ప్రజాప్రతినిధుల సారథ్యంలో ప్రజా సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
జీరో అయిపోయిన ప్రతిపక్షాలు గ్రామాల్లోకి వచ్చి ఓట్లు అడుగుతున్నాయని, అధికారంలో ఉన్నప్పుడే ప్రజలకు దూరంగా ఉన్న వ్యక్తులు ఇప్పుడు ప్రజలకు తోడుగా ఎలా ఉంటారని ప్రశ్నించారు. ప్రతి అభివృద్ధి పనిలో కూటమి ప్రభుత్వ ముద్ర ఉందని, అభివృద్ధి చేయని వారు ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతారని ఎద్దేవా చేశారు.
మనలో ఉన్న ఐక్యతను కాపాడుకుందాం, ఎక్కడా ఒంటరి పోరాటాలు లేవు, కూటమిగా సమిష్టిగా ముందుకు సాగుతున్నాం, ప్రతిపక్షాలకు డిపాజిట్లు కూడా రాకుండా చేయాలని ఎమ్మెల్యే రాము పిలుపునిచ్చారు.
ఎన్నికల ప్రచారంలో జనసేన ఇన్చార్జి బూరగడ్డ శ్రీకాంత్,మండల టిడిపి అధ్యక్షుడు పోలవరపు వెంకటరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ పొట్లూరి రవి, కొండలమ్మ గుడి చైర్మన్ ఈడే మోహన్, టిడిపి నాయకులు సాయన పుష్పావతి, వల్లభనేని వెంకటరావు,కొడాలి రామరాజు, వల్లభనేని సుబ్బారావు , పామర్తి సత్తిబాబు , చేకూరు జగన్మోహన్రావు, దుగ్గిరాల శేషుబాబు, మల్లిపెద్ది సుబ్రమణ్యం, అబ్దుల్ సత్తార్, కంచర్ల ప్రకాష్, జనసేన తోట చిన్నారి, కుప్పినేని శాసవేణి, సందు పవన్, వేమూరు శ్రీనాథ్, చిన్నగోన్నూరు,పురిటిపాడు, తాడిచర్ల, కట్టవాని చెరువు, చింతలగుంట, సేరిదగ్గుమిల్లి గ్రామాల కూటమి నాయకులు,ప్రజలు పాల్గొన్నారు.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST