తిరుమలలో వైభవంగా పౌర్ణమి గరుడసేవ
వాహన సేవలో పాల్గొన్న భారత ఉపరాష్ట్రపతి
తిరుమలలో రాత్రి అత్యంత వైభవంగా నిర్వహించిన పౌర్ణమి గరుడసేవలో భారత ఉపరాష్ట్రపతి సీ.పీ.రాధాకృష్ణన్ పాల్గొన్నారు.
రాత్రి 7 నుండి 9 గంటల వరకు సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు.
ఈ వాహన సేవలో జీయర్ స్వాములు, టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి, సి వి ఎస్ ఓ మురళీకృష్ణ పాల్గొన్నారు.
పౌర్ణమి గరుడ సేవలో పాల్గొన్న ఇతర ప్రముఖులలో జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి అనగాని సత్య ప్రసాద్, జిల్లా కలెక్టర్ డాక్టర్ వేంకటేశ్వర్, తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు, పలువురు బోర్డు సభ్యులు, ఇతర ఆలయ అధికారులు కూడా ఉన్నారు.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST