292 డివిజన్ – వారాల వినోద్ కుమార్ వాల్మీకి జయంతి వేడుకల్లో పాల్గొన్నారు
కుత్బుల్లాపూర్ వాల్మీకి బోయ సంఘం ఆధ్వర్యంలో రాంలీలా మైదానం, సూరారం లో ఘనంగా జరిగిన శ్రీశ్రీశ్రీ వాల్మీకి మహర్షి జయంతి మహోత్సవానికి BRS సీనియర్ నాయకులు వారాల వినోద్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం వాల్మీకి బోయ సంఘం నాయకులు వారాల వినోద్ కుమార్ ని శాలువాతో సన్మానించారు.
ఈ సందర్భంగా వారాల వినోద్ కుమార్ మాట్లాడుతూ – వాల్మీకి మహర్షి రచించిన రామాయణం యావత్ ప్రపంచానికి ఆదర్శమని, బోయల ఆత్మగౌరవం కోసం BRS పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలోBRS నాయకులు రాజ్ కుమార్ ముదిరాజ్ నాయకులు మహిళలు పాల్గొన్నారు. కమిటీ సభ్యులు:
అధ్యక్షులు: గోవిందరాజులు, ఉపాధ్యక్షులు: సి. వెంకటరమణ, ప్రధాన కార్యదర్శి: బి. రాములు, *కోశాధికారి: రతన్ లక్ష్మణ్
సభ్యులు: లక్ష్మణ్, హనుమంతు, వెంకటయ్య, రామకృష్ణ, విశ్వనాథ్, రంగప్ప, లక్ష్మణ్, గట్టు అశోక్ గజ్జల రమేష్ తదితరులు పాల్గొన్నారు.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST