ఓటు హక్కు పరిరక్షణే లక్ష్యంగా ‘ఓట్ బచావో – దేశ్ బచావో’ ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి

Sakshitha news

ఓటు హక్కు పరిరక్షణే లక్ష్యంగా ‘ఓట్ బచావో – దేశ్ బచావో’ ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి

మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ విలేకరుల సమావేశంలో నాయకుల పిలుపు

మేడ్చల్–మల్కాజిగిరి: అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (AICC) ఆదేశాల మేరకు చేపట్టిన ‘ఓట్ బచావో – దేశ్ బచావో’ ప్రచార కార్యక్రమంలో భాగంగా, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ కమిటీ DCC అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ అధ్యక్షతన జిల్లా స్థాయి విలేకరుల సమావేశం నిర్వహించారు

ఈ సమావేశానికి తమిళ్ నాడు రాష్ట్రం నుంచి విచ్చేసిన AICC అబ్జర్వర్ మోహన్ కుమార మంగళం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి , మాజీ TPCC ప్రధాన కార్యదర్శి నర్సభూపతి రెడ్డి , జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బొంగునూరి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ప్రజాస్వామ్య వ్యవస్థ పరిరక్షణ, ఓటు హక్కు సంరక్షణ లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ‘ఓట్ బచావో – దేశ్ బచావో’ ప్రచారాన్ని క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఓటు హక్కు ప్రాధాన్యతపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ, ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు పార్టీ శ్రేణులందరూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఈ ప్రచార కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు చురుకుగా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రతి పౌరుడి భాగస్వామ్యం కీలకమని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ కమిటీ సభ్యులు, డివిజన్ అధ్యక్షులు , సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మహిళ నాయకులు పాల్గొన్నారు