నవంబర్ 1 న ఢిల్లీలో ‘ఓట్ బచావో – దేశ్ బచావో’ నిరసనను విజయవంతం

Sakshitha news

నవంబర్ 1 న ఢిల్లీలో ‘ఓట్ బచావో – దేశ్ బచావో’ నిరసనను విజయవంతం చేయాలి
కాంగ్రెస్ శ్రేణులకు కూన శ్రీశైలం గౌడ్ పిలుపు

పెద్దపల్లి జిల్లా: ఏఐసీసీ పిలుపు మేరకు నవంబర్ 1న ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో నిర్వహించనున్న ‘ఓట్ బచావో – దేశ్ బచావో’ భారీ నిరసన కార్యక్రమానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని ఉమ్మడి కరీంనగర్ జిల్లా టీపీసీసీ అబ్జర్వర్, కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ పిలుపునిచ్చారు.

పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్ ఠాకూర్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సమావేశంలో పెద్దపల్లి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ విజయ రమణారావుతో పాటు రామగుండం, మంథని నియోజకవర్గాల ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఏఐసీసీ ఉమ్మడి జిల్లా క్లస్టర్ ఇన్‌చార్జి శరత్, నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు చేపట్టాల్సిన కార్యాచరణపై నాయకులకు దిశానిర్దేశం చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణ, ఓటు హక్కు రక్షణ లక్ష్యంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ శ్రేణులు ఐక్యంగా పాల్గొని విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు..

అదేవిధంగా జగిత్యాల జిల్లా కేంద్రం లో సైతం జిల్లా అధ్యక్షులు నందయ్య ఆధ్వర్యంలో ఓటు బచావో దేశ్ బచావో కార్యక్రమానికి సంబంధించిన జిల్లా కార్యవర్గ సభ్యుల తో కలిసి సమావేశం నిర్వహించరు…

ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు