ఎన్నికల నిర్వహణకు పటిష్ట చర్యలు తీసుకోవాలి: కమిషనర్

Sakshitha news

ఎన్నికల నిర్వహణకు పటిష్ట చర్యలు తీసుకోవాలి: కమిషనర్

అన్నమయ్య జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా అధికారులను ఆదేశించారు. ఎన్నికల నిర్వహణపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, ఎస్పీ ధీరజ్ పాల్గొన్నారు. నామినేషన్ కేంద్రాల వద్ద శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని, సున్నిత, అత్యంత సున్నిత పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత కల్పించాలని కమిషనర్ సూచించారు. జిల్లాలో ఎన్నికల నిర్వహణకు చేపట్టిన చర్యలను కలెక్టర్, ఎస్పీ వివరించారు.