బతుకమ్మ ఆటస్థలాన్ని పరిశీలించి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు

Sakshitha news

బతుకమ్మ ఆటస్థలాన్ని పరిశీలించి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 14వ డివిజన్ ఎనుమాముల రామలీల మైదానం ప్రాంతంలో బతుకమ్మ ఆటస్థలాన్ని వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు పరిశీలించారు. అనంతరం అక్కడ చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులతో మాట్లాడి, అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో చేపట్టాలని, నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని సూచించారు. పమహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పనులు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తూ, నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు తెలిపారు. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో 14వ డివిజన్ అధ్యక్షులు సయ్యద్ ఇంతియాజ్, మాజీ కార్పొరేటర్ సులోచన సారయ్య, ఎస్సీ సెల్ డిపార్ట్మెంట్ చైన్ సిలువేరు శ్రీనివాస్, సీనియర్ నాయకులు జానీ,రాజేష్, మహేష్, సుధీర్, చంద్రశేఖర్, స్టాలిన్, కుమార్, రవి, సజియా బేగం, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.