[3:43 pm, 15/10/2026] +91 99631 12221: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపే లక్ష్యం
ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు
వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మడికొండలోని శ్రీ సత్యసాయి కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన ఎన్నికల సన్నాహక సమావేశంలో రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి , శ్రీమతి సీతక్క , ఎంపీ శ్రీ వేం నరేందర్ రెడ్డి , కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థితో రాంరెడ్డి సరోత్తం రెడ్డి తో కలిసి వర్ధన్నపేట నియోజకవర్గ శాసనసభ్యులు, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయమే లక్ష్యంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికలకు సంబంధించి అనుసరించాల్సిన వ్యూహాలు, పార్టీ శ్రేణుల సమన్వయం, పట్టభద్రులను కలిసి కాంగ్రెస్ పార్టీ విధానాలు, ప్రజా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించాలని కోరారు.
పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది
కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా సంక్షేమం, యువత అభ్యున్నతి, విద్యావంతుల ఆకాంక్షల సాధనకు ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతోందని తెలిపారు. పట్టభద్రుల సమస్యలను పరిష్కరించడంతో పాటు వారి ఆశయాలకు అనుగుణంగా పనిచేసే అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు.
కాంగ్రెస్ శ్రేణులు ఐక్యంగా పనిచేయాలి
రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయానికి నియోజకవర్గాల వారీగా నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు సూచించారు. పట్టభద్రులను నేరుగా కలిసి కాంగ్రెస్ పార్టీకి మద్దతు కూడగట్టాలని, ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
సోషల్ మీడియాలో దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి
సోషల్ మీడియా వేదికగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్న దుష్ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వాస్తవాలతో తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంపై, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై కొందరు బీఆర్ఎస్ నాయకులు సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారాన్ని కార్యకర్తలు గమనిస్తూ, వాస్తవాలను ప్రజలకు వివరించాలని సూచించారు. ప్రజా ప్రభుత్వంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు అందుతున్న ప్రయోజనాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, చైర్మెన్లు, డీసీసీ అధ్యక్షులు,జిల్లా ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
[5:13 pm, 15/10/2026] +91 99631 12221: బతుకమ్మ ఆటస్థలాన్ని పరిశీలించి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 14వ డివిజన్ ఎనుమాముల రామలీల మైదానం ప్రాంతంలో బతుకమ్మ ఆటస్థలాన్ని వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు పరిశీలించారు. అనంతరం అక్కడ చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులతో మాట్లాడి, అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో చేపట్టాలని, నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని సూచించారు. పమహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పనులు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తూ, నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు తెలిపారు. ప్రజలకు మెరుగైన సౌకర్యాల…


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST
