హైదరాబాద్, రంగారెడ్డి మరియు మహబూబ్ నగర్ జిల్లాల కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి సామ రామ్ మోహన్ రెడ్డి విజయానికి కృషి చెయ్యాలి – నర్సారెడ్డి భూపతిరెడ్డి.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పట్టభద్రుల ఓటరు నమోదు అవగాహన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హనుమంత్ రెడ్డి తో కలిసి పాల్గొన్న మాజీ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతిరెడ్డి .
ఈ సందర్బంగా నర్సారెడ్డి భూపతిరెడ్డి మాట్లాడుతూ రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సామ రామ్ మోహన్ రెడ్డి గెలుపునకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఓటరు నమోదు ప్రక్రియ కోసం ప్రత్యేకంగా హెల్ప్ డెస్కులు నిర్వహించి పెద్ద ఎత్తున ఓటరు నమోదు చేయించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా గ్రంధాలయ చైర్మన్ బొంగునూరి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా ఫిషరీస్ చైర్మన్ మన్నే రాజు, జిల్లా కాంగ్రెస్ కమిటీ సభ్యులు, డివిజన్ అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST
