గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదు అవగాహన కార్యక్రమం
బాచుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియపై అవగాహన
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని బాచుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా కొలన్ హన్మంత్ రెడ్డి మాట్లాడుతూ, అర్హులైన ప్రతి పట్టభద్రుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరుగా తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని సూచించారు. ఇప్పటికే ఓటరు జాబితాలో పేర్లు ఉన్నవారు తమ పేరు, చిరునామా, ఇతర వివరాలను పరిశీలించుకొని, అవసరమైన మార్పులు, చేర్పులు చేసుకోవాలని తెలిపారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు ఎంతో విలువైనదని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ ఓటు హక్కును పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు.
అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటిస్తూ పట్టభద్రులకు ఓటరు నమోదు ప్రక్రియపై అవగాహన కల్పించాలని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో నమోదయ్యేలా సమన్వయంతో కృషి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో టీపీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతి రెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బొంగునూరి శ్రీనివాస్ రెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా ఫిషరీస్ చైర్మన్ మన్నే రాజు, డీసీసీ కమిటీ సభ్యులు, డివిజన్ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST
