కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, చింతల్ డివిజన్‌కు చెందిన ఎం. రాకేష్ ముదిరాజ్

Sakshitha news

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, చింతల్ డివిజన్‌కు చెందిన ఎం. రాకేష్ ముదిరాజ్ మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా NSUI అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి,షాల్వా తో సత్కరించారు.అనంతరం నియామక పత్రాన్ని హన్మంత్ రెడ్డి చేతుల మీదగా అందుకున్నారు.

ఈ సందర్భంగా కొలన్ హన్మంత్ రెడ్డి మాట్లాడుతూ, ఎం. రాకేష్ ముదిరాజ్‌కు జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడం అభినందనీయమని, విద్యార్థుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తూ, విద్యార్థి ఉద్యమాల్లో చురుకుగా పాల్గొని, NSUI సంస్థను మరింత బలోపేతం చేయాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో ఇలాంటి మరెన్నో ఉన్నత పదవులు చేపట్టి, ప్రజలకు మరియు విద్యార్థులకు సేవలందిస్తూ, రాజకీయంగా మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు