CURE పరిధిలోని భౌరంపేట్ ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి నూతన భవన నిర్మాణానికి నిధుల మంజూరు
నిర్మాణ ప్రణాళికపై ఉపాధ్యాయులతో చర్చించిన మాజీ కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం CURE పరిధిలో ప్రభుత్వం ప్రత్యేకంగా కేటాయించిన నిధులతో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ సర్కిల్ పరిధిలోని భౌరంపేట్ ప్రభుత్వ పాఠశాలలో నూతన భవన నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. ఈ నేపథ్యంలో భౌరంపేట్ మాజీ కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి పాఠశాలను సందర్శించి, నూతన భవన నిర్మాణానికి సంబంధించిన అంశాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులతో కలిసి భవన నిర్మాణ విధానం, విద్యార్థులకు అవసరమైన సౌకర్యాల కల్పన తదితర అంశాలపై చర్చించారు. పాఠశాల అవసరాలు, విద్యార్థుల భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిర్మాణ పనులు చేపట్టాలని సూచించారు. నూతన భవనం అందుబాటులోకి వస్తే విద్యార్థులకు మెరుగైన వసతులతో కూడిన విద్యా వాతావరణం కల్పించేందుకు దోహదపడుతుందని పేర్కొన్నారు.
అనంతరం దసరా సెలవులను పురస్కరించుకుని పాఠశాలలో నిర్వహించిన బతుకమ్మ వేడుకలను నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొన్నారు


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST
