ఆర్టీసీ ఉద్యోగుల యూనియన్ ఎన్నికల్లో ఈయూ, టీఎంయూ, ఎన్ఎంయు యూనియన్ ఘన విజయం.

Sakshitha news

ఆర్టీసీ ఉద్యోగుల యూనియన్ ఎన్నికల్లో ఈయూ, టీఎంయూ, ఎన్ఎంయు యూనియన్ ఘన విజయం..


సాక్షిత సూర్యాపేట జిల్లా/ కోదాడ :
క్లాస్‌–3లో బస్సు గుర్తుకు 165 ఓట్లు.. క్లాస్‌–6లో నిచ్చెన గుర్తుకు 159 ఓట్లు

కోదాడ ఉద్యోగుల యూనియన్ ఈ యు, టీఎంయూ, ఎన్ఎంయు యూనియన్ విజయాన్ని సాధించారు. క్లాస్‌–3 విభాగంలో బస్సు గుర్తుకు 165 ఓట్లు రాగా, టిడబ్ల్యూ బాణం గుర్తుకు 94 ఓట్లు వచ్చాయి. దీంతో బస్సు గుర్తుపై పోటీ చేసిన అభ్యర్థులు 71 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.

అదేవిధంగా క్లాస్‌–6 విభాగంలో నిచ్చెన గుర్తుకు 159 ఓట్లు రాగా, ఎస్‌డబ్ల్యూఎఫ్‌ ధర్మచక్రం గుర్తుకు 97 ఓట్లు వచ్చాయి. నిచ్చెన గుర్తు అభ్యర్థులు 62 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

మొత్తం 261 ఓట్లకు గాను 259 ఓట్లు పోలయ్యాయి. ఉద్యోగులు ఉత్సాహంగా ఓటింగ్‌లో పాల్గొని తమ అభ్యర్థులను ఎన్నుకున్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన ఎంప్లాయీస్ యూనియన్, టీఎంయూ, ఎన్‌ఎంయూ యూనియన్లకు సంబంధించిన వివరాలను యూనియన్ ప్రతినిధులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో గురు లక్ష్మి, తోళ్ల భవాని, చుక్కమ్మ, రాణి, రేవతి, రేణుక, వాణి, రాజ్యలక్ష్మి, ఎం.రేణుక, విజయలక్ష్మి, ఝాన్సీ, ఎస్.కె అబ్దుల్లా, ఎస్ జానయ్య, ఎస్ ఎస్ గౌడ్, ఎస్ వెంకన్న, జమాల్ గౌడ్, ఆయు, ఏ శ్రీను, కే ఉప్పలయ్య, బి పాండు, ఎస్ఎస్ రావు, చక్రపాణి తదితరులు పాల్గొన్నారు.