SIR అక్రమాలపై భారీ నిరసన మార్చ్‌లో పాల్గొన్న కొలన్ హన్మంత్ రెడ్డి

Sakshitha news

SIR అక్రమాలపై భారీ నిరసన మార్చ్‌లో పాల్గొన్న కొలన్ హన్మంత్ రెడ్డి ||

హైదరాబాద్: SIR ప్రక్రియలో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అక్రమాలు, అవకతవకలకు నిరసనగా AICC ఆదేశాల మేరకు TPCC అధ్యక్షులు శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్ ఇందిరా గాంధీ విగ్రహం నుంచి రాజ్‌భవన్ వరకు నిర్వహించిన భారీ నిరసన మార్చ్‌లో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఓటు హక్కు ప్రతి పౌరుడి ప్రజాస్వామ్య హక్కు అని, ఓటర్ల జాబితాలో పూర్తి పారదర్శకత, నిష్పక్షపాతత్వం ఉండాలని అన్నారు. SIR ప్రక్రియలో జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్న అవకతవకలపై సమగ్ర విచారణ జరిపి, ఓటర్ల హక్కులను కాపాడాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీలు, మంత్రి DCC సభ్యులు, జిల్లా స్థాయి నాయకులు, నియోజకవర్గ నాయకులు, డివిజన్ అధ్యక్షులు, మహిళా కాంగ్రెస్ నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, మైనారిటీ నాయకులు, SC, ST, NSUI, INTUC విభాగాల నాయకులు, కార్యకర్తలు మరియు కాంగ్రెస్ పార్టీ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఓటు హక్కు పరిరక్షణ కోసం.. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం.. కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగుతుందని కొలన్ హన్మంత్ రెడ్డి తెలిపారు.