బీజేపీ ఆధ్వర్యంలో విజయవంతంగా మెగా రక్తదాన శిబిరం

Sakshitha news

బీజేపీ ఆధ్వర్యంలో విజయవంతంగా మెగా రక్తదాన శిబిరం

ప్రధాని మోదీ ప్రజా జీవితంలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సేవా సంకల్ప అభియాన్-

సాక్షిత సూర్యాపేట జిల్లా /కోదాడ :
భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రజా జీవితంలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘సేవా సంకల్ప అభియాన్’ మెగా రక్తదాన శిబిరం విజయవంతంగా జరిగింది. కోదాడ పట్టణంలోని పెరిక హాస్టల్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి బీజేపీ నాయకులు, కార్యకర్తలు, యువత, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై రక్తదానం చేశారు.ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ.. రక్తదానం ప్రాణదానంతో సమానమని, ఆపదలో ఉన్న వారికి రక్తం అందించి ప్రాణాలను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రజా జీవితంలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సేవా భావంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు.మెగా రక్తదాన శిబిరానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని, రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికీ బీజేపీ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో కూడా ప్రజలకు ఉపయోగపడే మరిన్ని సేవా కార్యక్రమాలను నిర్వహిస్తామని వారు తెలియజేశారు .