కైసర్ నగర్‌లో ఇందిరమ్మ టవర్స్‌కు శంకుస్థాపన
హైదరాబాద్: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామారం సర్కిల్ పరిధిలోని కైసర్ నగర్‌లో 480 ఫ్లాట్లతో నిర్మించనున్న 4 ఇందిరమ్మ టవర్స్‌కు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , జిల్లా ఇన్‌చార్జి మంత్రి శ్రీధర్ బాబు శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ పాల్గొని మంత్రులకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల సొంతింటి కలను నెరవేర్చేలా కైసర్ నగర్‌లో 480 కుటుంబాలకు గృహాలు అందుబాటులోకి రానుండటం సంతోషకరమన్నారు. నిర్మాణ పనులను నాణ్యతతో, వేగంగా పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని కోరారు…
అనంతరం మంత్రులతో కలిసి ఇళ్ల లబ్ధిదారులకు ఇంటి పత్రాలను పంపిణీ చేశారు…
కార్యక్రమంలో హౌసింగ్ MD గౌతం , జిల్లా కలెక్టర్ మనో చౌదరి ,కార్పొరేషన్ చైర్మన్లు అజయ్, చరణ్ కౌశిక్, శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు కోలన్ హనుమంత్ రెడ్డి, కూన శ్రీనివాస్ గౌడ్ , ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST
