సీఈసీ జ్జానేష్ కుమార్ ను తక్షణమే తొలగించాలి..

Sakshitha news

సీఈసీ జ్జానేష్ కుమార్ ను తక్షణమే తొలగించాలి..

ఖమ్మం లో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు…

ఖమ్మం నగరంలోని కలెక్టర్ కార్యాలయం ధర్నా చౌక్ వద్ద ఏఐసీసీ,టీపిసిసి పిలుపు మేరకు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్ అధ్వర్యంలో జ్జానేష్ కుమార్ రాజీనామా కోరుతూ భారీ నిరసన ధర్నా కార్యక్రమం చేపట్టారు, అనంతరం కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి జ్ఞానేశ్ కుమార్ దిష్టిబొమ్మ దహనం చేశారు..ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు పాల్గొని మాట్లాడుతూ ‌ ఓటర్ల జాబితాల నుంచి పేర్ల తొలగింపు ఓటు హక్కుకు సంబంధించిన అంశాలపై ఎన్నికల సంఘం స్పష్టత ఇవ్వాలన్నారు.. దేశవ్యాప్తంగా ఓటర్ జాబితాల నుంచి పేర్లు తొలగించిన ఆరోపించారు.. ఎన్నో ఏళ్లుగా ఓటు హక్కు కలిగిన వారి పేర్లను తొలగించడం పై ఎన్నికల సంఘం చట్టబద్దమైన వివరాలను ప్రజలకు తెలియజేయాలని కోరారు..సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు…