దళితులు, మహిళల గౌరవం, ఆత్మగౌరవం, భద్రతను కాపాడాలని కోరుతూ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ని కలిసి వినతిపత్రం సమర్పించారు.
శాసనసభ స్పీకర్‌పై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు చేసిన అనుచిత వ్యాఖ్యలు, పోలీసులపై దాడులు, మహిళా పోలీసులతో అనుచిత ప్రవర్తన, దళితులు నడిచిన రహదారులను పసుపు నీరు, పాలతో శుద్ధి చేయడం వంటి ఘటనలు రాజ్యాంగ స్ఫూర్తికి, మానవ విలువలకు విరుద్ధమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు పేర్కొన్నారు.
దళితుల ఆత్మగౌరవాన్ని అవమానించే ఇలాంటి చర్యలకు పాల్పడిన ప్రత్యక్ష వ్యక్తులతో పాటు, వాటి వెనుక ఉన్న బీఆర్‌ఎస్ అగ్ర నాయకత్వంపై కూడా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ను కోరినట్లు తెలిపారు.
దళితుల గౌరవం, సమానత్వం, రాజ్యాంగ హక్కుల పరిరక్షణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడదని ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST