కొలన్ సులోచన గారి మృతికి రమేష్ రెడ్డి సంతాపం

Sakshitha news

కొలన్ సులోచన గారి మృతికి రమేష్ రెడ్డి సంతాపం!!

కుత్బుల్లాపూర్: కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి *కొలన్ హన్మంత్ రెడ్డి గారి మాతృమూర్తి, కీ.శే. కొలన్ సులోచన గారు ఈ నెల 9 వ తేదీన అకాల మరణం చెందడంతో, ఈరోజు ఆయన నివాసానికి మిత్రుడు రమేష్ రెడ్డి విచ్చేసి సంతాపం తెలిపారు.

ఈ సందర్భంగా రమేష్ రెడ్డి గారు కొలన్ హన్మంత్ రెడ్డి గారిని పరామర్శించి, సులోచన గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.

సులోచన గారి మృతి పట్ల వారు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు

ఈ కార్యక్రమం లో సీనియర్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు