వినాయకుడి పూజా కార్యక్రమంలో పాల్గొన్న మాజీ శాసనసభ్యులు శ్రీ కూన శ్రీశైలం గౌడ్

Sakshitha news

వినాయకుడి పూజా కార్యక్రమంలో పాల్గొన్న మాజీ శాసనసభ్యులు శ్రీ కూన శ్రీశైలం గౌడ్

గణేష్ చతుర్థి సందర్భంగా ఈరోజు గాజులరామారం విలేజ్ లో గణేష్ చతుర్థి పూజా కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ఆ వినాయకుడి దర్శించుకున్న స్థానిక కుత్బుల్లాపూర్ మాజీ శాసనసభ్యులు శ్రీ కూన శ్రీశైలం గౌడ్ *

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షిస్తూ అందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు..

అనంతరం కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్ ని శాలువ తో సత్కరించి ఆ స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు..

ఈ కార్యక్రమంలో స్థానికులు ఇంద్రసేనారెడ్డి, ఇంద్రసేనా గుప్త, బాలరాజు, యాదగిరి, శ్రీరాములు, కూన రాఘవేందర్ గౌడ్,ముత్యపాగా లక్ష్మణ్, సురేష్, నరసింహ రెడ్డి, నరేంద్ర వర్మ, యం సాగర్, కూన నరేష్ గౌడ్, సుజిత్ రెడ్డి, కూన వంశీ గౌడ్, యశ్వంత్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి లతో పాటు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు