కాంగ్రెస్ పార్టీకి ప్రజా మద్దతు. సంపత్ కుమార్.
అలంపూర్ సాక్షిత. : కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని ఏఐసిసి కార్యదర్శి అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ అన్నారు.
అయిజ పట్టణ పరిధిలో తొమ్మిదో వార్డు ప్రచారంలో భాగంగా హస్తం జోరు శుక్రవారం రోజున ఇంటింటా ప్రచారం నిర్వహించి ప్రజల మద్దతు కోరుతున్నారు… అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక మంచి సంక్షేమ పథకాల పట్ల ప్రజల నుండి మంచి స్పందన వస్తుందన్నారు…కనుక తొమ్మిదో వార్డును అభివృద్ధి చేసుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శైలజ ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు శ్రేణులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి షేక్షావలి ఆచారి సంకాపురం రాముడు, ఐజ టౌన్ ఉపాధ్యక్షుడు కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY