దేశవ్యాప్తంగా ఎరువుల ప్రయోగశాలలకు ఎంత నిధులు ఖర్చు చేశారు?
- లోక్ సభలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ప్రశ్న
దేశవ్యాప్తంగా ప్రస్తుతం పనిచేస్తున్న ఎరువుల ప్రయోగశాలల బలోపేతానికి ఎన్ని నిధులు ఖర్చు చేశారని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఆరా తీశారు. ఈ మేరకు లోక్‌సభలో ఆయన పలు అంశాలపై ప్రశ్నించారు. దేశంలో ప్రస్తుతం పనిచేస్తున్న ఎరువుల పరీక్ష ప్రయోగశాలలు, వాటి సామర్థ్యం, గత ఐదేళ్లలో ప్రయోగశాలలు పరీక్షించిన మొత్తం ఎరువుల నమూనాల సంఖ్య, దేశవ్యాప్తంగా సకాలంలో పరీక్షలు, నాణ్యత అమలును నిర్ధారించడానికి తీసుకున్న చర్యలు, ఖాళీల భర్తీ వివరాలపై వివరాలు కోరారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ప్రశ్నలకు కేంద్ర రసాయనాలు మరియు ఎరువుల శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ సమాధానం ఇచ్చారు. దేశవ్యాప్తంగా 84(కేంద్ర ప్రభుత్వం 4, రాష్ట్ర ప్రభుత్వాలు 80) ఎరువుల పరీక్షల ప్రయోగశాలలు ఉన్నాయని, వాటి 2024-25 వార్షిక సామర్థ్యం 1,88,236 అన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3 ఎరువుల ప్రయోగశాలలు ( అనంతపురం, బాపట్ల, తాడేపల్లిగూడెం) ఒక్కోదాని సామర్థ్యం 3500 అన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY