కనుల పండుగగా సుదర్శన నరసింహ సాహిత శ్రీ మహాలక్ష్మి యాగం

Sakshitha news

కనుల పండుగగా సుదర్శన నరసింహ సాహిత శ్రీ మహాలక్ష్మి యాగం…

సాక్షిత : సూర్యాపేట జిల్లా/కోదాడ : స్వస్థ శ్రీ పరాభనామ సంవత్సర శ్రావణమాస అమావాస్య పట్టణములోని స్థానిక శ్రీనివాసనం వెంచర్ నందు శ్రీ శక్తి జ్యోతిష్య నిలయం చఆధ్వర్యంలో సుదర్శన లక్ష్మీ నృసింహ మహాయాగం భక్తిశ్రద్ధలతో వేద పండితుల మంత్రాలతో కన్నుల పండుగగా వైభవోపేతంగా నిర్వహించారు వేద పండితులు గోపూజ ఆరాధన పుణ్య హవాచనం దీక్ష ధారణ అగ్ని ప్రతిష్టాపన లక్ష్మీ గణపతి లక్ష్మీ కుబేర సుదర్శన నరసింహ అష్టోత్తర శతపద్మాలతో శ్రీ మహాలక్ష్మి యాగాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వేద పండితులు మాట్లాడుతూ ఈ సుదర్శన నరసింహ సాహితీ శ్రీ మహాలక్ష్మీ యాగం కోదాడ ప్రాంత ప్రజలు సుభిక్షంగా ఉండాలని వర్షాలు మెండుగా కురిచి పాడిపంటలతో రైతులు ఆయురారోగ్యాలతో సిరిసంపదలతో వర్ధిల్లాలని ఈ యాగం నిర్వహించినట్లు చెప్పారు ఈ యాగం లో శ్రీనివాసన్ వెంచర్నిర్వాహకులు మేళ్లచెరువు కోటేశ్వరరావు దంపతులు వేద పండితులు కాండూరి‌,వంశీకృష్ణమాచార్యులు,తిరుపతి సుబ్రహ్మణ్య శర్మ, దివి సందీప్ చార్యులు,దాత కోదాడ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు పైడిమర్రి నారాయణరావు సహకారంతో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.