పిడుగురాళ్ల మున్సిపాలిటీ మండల జనసేన పార్టీ ఆఫీస్ నందు ముఖ్య నాయకులు సమావేశం
నర్సాపేట పార్లమెంటరీ లోకల్ బాడీ ఎలక్షన్స్ కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు, పిడుగురాళ్ల మండల జనసేన పార్టీ అధ్యక్షులు కామిశెట్టి రమేష్ ఆధ్వర్యంలో…పిడుగురాళ్ళ మున్సిపాలిటీ పరిధిలోని ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది, ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ.. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో అందరూ కలిసికట్టుగా పనిచేయాలని, కూటమిస్ఫూర్తికి విఘాతం కలిగించకుండా మూడు పార్టీల సమన్వయంతో ముందుకు వెళ్లాలని కోరారు, మొదటినుంచి కష్టపడి పనిచేసిన వారికి పార్టీలో సముచిత స్థానం లభిస్తుందని, తెలియజేశారు, ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నియోజవర్గ సమన్వయకర్త కటకం అంకారావు, మరియు జిల్లా సంయుక్త కార్యదర్శి దూదేకుల ఖాసిం సైదా, పట్టణ నీటి సంఘం ఉపాధ్యక్షులు కామిశెట్టి అమరలింగేశ్వరరావు, మండల ప్రధాన కార్యదర్శి గుర్రం కోటేశ్వరరావు,కంభం పాటి ముక్కంటి, ధీకొండ కిరణ్ కుమార్, కొమిరిశెట్టి సతీష్, చింతా వెంకటశివరావు, తుమ్మలచెరువు వెంకటేశ్వర్లు, గోపిశెట్టి సాయి కృష్ణ, సింగంశెట్టి పూర్ణచంద్రరావు, కామిశెట్టి అశోక్, రామిశెట్టి విజయ్, గుంటూరు శ్రీను, బేతంచర్ల నాగేశ్వరరావు, మందా జెస్సీ, మొదలగు వారు పాల్గొన్నారు,


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST