చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన నాయకుడు

Sakshitha news

చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన నాయకుడు::తెదేపా జాతీయ ఉపాధ్యక్షులు వై వి బి రాజేంద్ర ప్రసాద్ .

తెలుగుదేశం పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి,నారాచంద్రబాబు నాయుడు ని గత వైసీపీ ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసి మూడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా టీడీపీ పట్టణ కార్యాలయంలో పట్టణ అధ్యక్షులు జంపాన గురునాథం ఆధ్వర్యంలోజగన్ పాలనలో చీకటి రోజులను గుర్తు చేస్తూ నిజం గెలవాలి అని కొవ్వొత్తుల ప్రదర్శన జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ వై వి బి రాజేంద్ర ప్రసాద్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ… మూడు సంవత్సరాల క్రితం జగన్మోహన్ రెడ్డి వైసిపి ప్రభుత్వం చంద్రబాబు ని అరెస్టు చేసి చీకట్లో నెట్టాలని ప్రయత్నించారు. కానీ ఆ చీకటి ఎక్కువ కాలం నిలవలేదు.ప్రజల విశ్వాసం అనే వెలుగు ఆ చీకటిని తరిమికొట్టిందని రాజేంద్రప్రసాద్ అన్నారు, చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన నాయకుడని, ఉమ్మడి రాష్ట్రంలోనూ ఆంధ్రప్రదేశ్ లోను అభివృద్ధికి కొత్త దిశ దశ చూపించిన వెజినరీ నాయకుడు అని అన్నారు, చంద్రబాబు పై తెలుగు ప్రజల విశ్వాసం చెక్కుచెదరదని రాజేంద్రప్రసాద్ అన్నారు.

ఈ కార్యక్రమంలో ఉయ్యూరు మాజీ చైర్మన్ వల్లభనేని సత్యనారాయణ, అబ్దుల్ కుదూస్, క్లస్టర్ ఇంచార్జ్ కోనపురెడ్డి వాసు, మాజీ కౌన్సిలర్లు,వార్డు అధ్యక్షులు, టిడిపి సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.