ప్రజా సమస్యల పరిష్కారాన్ని కృషి చేస్తానన్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్
కుత్బుల్లాపూర్: కుత్బుల్లాపూర్ మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్ షాపూర్ నగర్‌లోని తన నివాసంలో నియోజకవర్గ పరిధిలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలను కలుసుకుని వారి సమస్యలు, వినతులను స్వీకరించారు.
ఈ సందర్భంగా పలు కాలనీలకు చెందిన ప్రజలు తమ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలను మాజీ ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ప్రజలు వివరించిన కొన్ని సమస్యలపై సంబంధిత అధికారులతో ఆయన ఫోన్‌లో మాట్లాడి తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. మరికొన్ని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే విధంగా తన వంతు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.
అదేవిధంగా రోడ్డమేస్త్రి నగర్ డివిజన్‌కు చెందిన పలువురు మహిళలు రాఖీ పౌర్ణమి పురస్కరించుకొని కూన శ్రీశైలం గౌడ్ ని కలిసి రాఖీలు కట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మహిళలకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు. తనపై చూపుతున్న ప్రేమ, అభిమానం ఇలాగే ఎల్లప్పుడూ కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు.
ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటానని ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ పేర్కొన్నారు..
ఈ కార్యక్రమంలో పలు కాలనీల వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు..


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST