నందిగామ అభివృద్ధికి ప్రత్యేక నిధులపై సౌమ్య వినతి
కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ను కలిసిన ప్రభుత్వ విప్
నందిగామ నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్‌ను కోరారు.
నందిగామలో ఆధునిక సౌకర్యాలతో నూతన పోస్టల్ భవనం నిర్మాణానికి నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే నందిగామ–గుడిమెట్ల రహదారి విస్తరణకు సీఆర్‌ఎఫ్ నిధులు మంజూరు చేయాలని కోరారు. ఈ రహదారి అభివృద్ధి ద్వారా పరిసర ప్రాంతాల్లోని 13 గ్రామాల ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కలుగుతుందని వివరించారు.
రాష్ట్ర–కేంద్ర ప్రభుత్వాల సమన్వయంతో నందిగామకు మరిన్ని అభివృద్ధి పనులు తీసుకురావడమే లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు సౌమ్య తెలిపారు.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST