సెప్టెంబర్ 12జాతీయ లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలి……. జిల్లా ప్రధాన న్యాయమూర్తి భాకరాజు శ్రీనివాసరావు
సాక్షిత వనపర్తి
జిల్లాలోని అన్ని కోర్టుల పరిధిలో ఉన్న రాజీ పడదగిన పెండింగ్ కేసులను సెప్టెంబర్ 12 జిల్లా కోర్టు పరిధిలో నిర్వహించే జాతీయ లోకాదాలతో కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భాకరాజు శ్రీనివాసరావు కోరారు
జిల్లాలోని పబ్లిక్ ప్రాసిక్యూటర్ లు, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, బార్ సంఘం న్యాయవాదుల తో ప్రత్యేక సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని
కోర్టు లలో పెండింగ్ లొ ఉన్న 589 క్రిమినల్ కంపౌండబుల్ కేసుల ను గుర్తించడం జరిగిందనీ పరిష్కారం కొరకు ఈ జాతీయ లోక్ అదాలత్ ను నిర్వహించడం జరుగుతుందనీ.
కావున కక్షిదారులు ఈ జాతీయ లోక్ అదాలత్ ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి
బాకరాజు శ్రీనివాస్ రావు, మరియు జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి జి. కళార్చన తెలియజేశారు. కార్యక్రమంలో పోక్సో కోర్టు ప్రత్యేక ప్రధాన న్యాయమూర్తి కె.లావణ్య బాల్ రెడ్డి, సీనియర్ సివిల్ జడ్జి కవిత, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ కార్తీక్ రెడ్డి, ఫస్ట్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ శ్రీలత, సెకండ్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ ఎన్. అశ్విని, బార్ సంఘం అధ్యక్షుడు కిరణ్ కుమార్, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ లు, మరియు
కోర్టు సీనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST