బాచుపల్లి ఎల్లమ్మ దేవాలయం వద్ద నూతన సీసీ రోడ్డు పనులకు శ్రీకారం ||
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బాచుపల్లి పరిధిలోని శ్రీ శ్రీ శ్రీ ఎల్లమ్మ దేవాలయం వద్ద నూతన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై శ్రీకారం చుట్టారు.
ఈ సందర్భంగా హన్మంత్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా అభివృద్ధి పనులను చేపడుతున్నామని తెలిపారు. దేవాలయానికి వచ్చే భక్తులు, స్థానిక ప్రజలకు రాకపోకల్లో ఇబ్బందులు లేకుండా నూతన సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు.
రోడ్డు నిర్మాణ పనులను నాణ్యతా ప్రమాణాలతో త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ప్రజల అవసరాలను గుర్తించి, స్థానిక సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని తెలిపారు.
నూతన సీసీ రోడ్డు పనులు ప్రారంభం కావడంతో బాచుపల్లి గ్రామ పెద్దలు, కాలనీ సభ్యులు మరియు స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ కొలన్ హన్మంత్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బాచుపల్లి గ్రామ పెద్దలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కాలనీ సభ్యులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST