150 మందిపేదలకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన……. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి

Sakshitha news

150 మందిపేదలకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన……. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి

సాక్షిత వనపర్తి
ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్లో అత్యవసర వైద్య సేవలు పొందిన పేదలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సీఎం సహాయనిధి నుండి విడుదలైన 150 మంది నియోజకవర్గానికి చెందిన నిరుపేదలకు 45. 31.100 విలువ చేసే చెక్కులను తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి చేతులు మీదుగా లబ్ధిదారులకు అందజేశారు అనంతరం చిన్నారెడ్డి మాట్లాడుతూ పేదలకు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా కార్పొరేట్ వైద్యం తమ ప్రభుత్వం అందించడం జరుగుతుందన్నారు ఆరోగ్యశ్రీ లేనివారికి చికిత్స అనంతరం సీఎంఆర్ఎఫ్ ద్వారా కొంత ఆర్థిక ఉపశమనం కలిగిస్తుందని అందులో భాగంగానే నియోజకవర్గానికి సంబంధించిన లబ్ధిదారులకు పార్టీలకతీతంగా సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేయడం జరిగిందని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి పేదవారికి అందేలా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పని చేయాలని ఆయన కోరారు.


సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందుకున్న లబ్ధిదారులు సీఎం రేవంత్ రెడ్డికి ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో టిపి టీపిసిసి ప్రధాన కార్యదర్శి నందిమల్ల యాదయ్య తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాజు గాంధీ పంచాయతీరాజ్ సంఘటన అధ్యక్షులు అజేంద్రప్రసాద్ యాదవ్ రాష్ట్ర మైనార్టీ నాయకులు అత్తర్ జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ దేవన్న యాదవ్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ చంద్రశేఖర్ జిల్లా ఏఐపిసి అధ్యక్షులు నాగార్జున వనపర్తి పట్టణ ప్రధాన కార్యదర్శి అడ్వకేట్ బాబా మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆవుల చంద్రశేఖర్ పెబ్బేరు మండల యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు అనిల్ అయ్యవారిపల్లె సర్పంచ్ కురుమన్న సీనియర్ నాయకులు వెంకటేశ్వర్ రెడ్డి సహదేవుడు మన్యం యాదవ్ రాముడు హరిబాబు రెడ్డి ఇమ్రాన్ శ్రీధర్ వెంకటేష్ సాగర్ ఆనంద్ సాగర్ శివ నారాయణ చెన్నయ్య వెంకటేష్ నాగన్న తదితరులు పాల్గొన్నారు