రామగుండం పోలీస్ అధికారుల సంఘానికి కొత్త నాయకత్వం….

Sakshitha news

రామగుండం పోలీస్ అధికారుల సంఘానికి కొత్త నాయకత్వం….

అధ్యక్షుడిగా వి. నవీన్‌కుమార్‌ ఎన్నిక..

నూతన కార్యవర్గానికి సీపీ అంబర్‌ కిషోర్‌ ఝా అభినందనలు…

సాక్షిత పెద్దపల్లి-జిల్లా ప్రతినిధి, రామగుండం/ : రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌ పోలీస్‌ అధికారుల సంఘం నూతన కార్యవర్గం ఎన్నికలు కమిషనరేట్‌ కార్యాలయ కాన్ఫరెన్స్‌ హాల్‌లో నిర్వహించారు. ఎన్నికల్లో శ్రీరాంపూర్‌ పోలీస్‌స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్‌ వి. నవీన్‌కుమార్‌ తన సమీప ప్రత్యర్థి ఏఆర్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ రాంచందర్‌పై ఐదు ఓట్ల ఆధిక్యంతో అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా ఆదేశాల మేరకు ఎన్నికల నోడల్‌ అధికారి, అదనపు డీసీపీ కె. శ్రీనివాస్‌ పర్యవేక్షణలో ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల నిర్వహణ కమిటీ సభ్యులుగా అదనపు డీసీపీ శ్రీనివాస్‌, ఏసీపీలు నాగేంద్రగౌడ్‌, రమేష్‌, ఏఓ శ్రీనివాస్‌ వ్యవహరించగా, స్పెషల్‌ బ్రాంచ్‌ ఇన్‌స్పెక్టర్‌ భీమేష్‌, ఎస్‌ఐ చంద్రశేఖర్‌ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రక్రియ కొనసాగింది.
ఎన్నికల్లో వివిధ హోదాల్లో పనిచేస్తున్న 70 మంది పోలీస్‌ అధికారులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల ప్రక్రియను సీపీ అంబర్‌ కిషోర్‌ ఝా పరిశీలించి, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులకు పలు సూచనలు చేశారు.

నూతన కార్యవర్గం:-

అధ్యక్షుడు: వి. నవీన్‌కుమార్‌ – పోలీస్‌ కానిస్టేబుల్‌, శ్రీరాంపూర్‌ పోలీస్‌స్టేషన్‌ ఉపాధ్యక్షులు: ఎన్‌. శ్రీనివాస్‌ – ఇన్‌స్పెక్టర్‌, సైబర్‌ క్రైమ్‌; ఎం. తిరుపతి – ఏఎస్సై, పెద్దపల్లి రూరల్‌ ప్రధాన కార్యదర్శి: జె. అంజనేయులు – ఎస్సై, సీసీబీ రామగుండం సంయుక్త కార్యదర్శి: కె. ఓంకార్‌ – కానిస్టేబుల్‌, రామకృష్ణాపూర్‌ సంస్థాగత కార్యదర్శి: డి. వినోద్‌బాబు – కానిస్టేబుల్‌, ఎన్టీపీసీ
కోశాధికారి: టి. సుందర్‌సింగ్‌ – కానిస్టేబుల్‌, ధర్మారం
కార్యనిర్వాహక సభ్యులు: ఎం.డి. రిజ్వాన్‌ షా ఖాన్‌, డి. అనిల్‌కుమార్‌, సి.హెచ్‌. దేవరాజ్‌ కార్యవర్గ సభ్యులు: ఎం. రాజిత, ఎ. కపిల్‌, డి. రాజం
ఎన్నికల్లో విజయం సాధించిన నూతన కార్యవర్గ సభ్యులు సోమవారం సీపీ కార్యాలయంలో పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝాను మర్యాదపూర్వకంగా కలిసి మొక్కలను అందజేశారు. అనంతరం సీపీ విజయం సాధించిన అభ్యర్థులకు అధికారికంగా ఎన్నికల ధ్రువీకరణ పత్రాలను అందజేశారు.

ఈ సందర్భంగా సీపీ నూతన కార్యవర్గ సభ్యులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. పోలీస్‌ సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలపై సంఘం ప్రతినిధులు తక్షణమే స్పందించాలని సూచించారు. సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి చొరవ చూపాలని అన్నారు.
పోలీస్‌ అధికారుల సంఘం సిబ్బంది సంక్షేమానికి అండగా నిలుస్తూ, బాధ్యతాయుతంగా, సమన్వయంతో పనిచేసి పోలీస్‌ సిబ్బందికి స్ఫూర్తిదాయకంగా నిలవాలని సీపీ ఆకాంక్షించారు.