ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా రాఖీ వేడుకలు…

Sakshitha news

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా రాఖీ వేడుకలు…

హన్మకొండ సుబేదారిలోని వర్ధన్నపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రక్షాబంధన్ పర్వదిన వేడుకలు ఘనంగా జరిగాయి. వర్ధన్నపేట ఎమ్మెల్యే,విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు కి హనుమకొండ మల్లికంబ మనోవికాస కేంద్రంలోని చిన్నారులు రాఖీలు కట్టి స్వీట్లు తినిపించారు.చిన్నారులు ఎమ్మెల్యే మిఠాయిలు పంచిపెట్టి ఆశీస్సులు అందించారు.నియోజకవర్గంలో మహిళలు కూడా ఎమ్మెల్యే కి రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే నియోజకవర్గ ప్రజలందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికార ప్రతినిధి నిమ్మని శేఖర్ రావు ,నాయకులు కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top