కోదాడ-విజయవాడ హై పై ఘోర రోడ్డుప్రమాదం..
సాక్షిత : సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ద్వారకుంట సమీపంలో జాతీయ రహదారి 65 పై రోడ్డు ప్రమాదం ఈ ప్రమాదంలో
6గురు మృతి పలువురి పరిస్థితి విషమం కంటైనర్ ను వెనక నుంచి ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు క్షతగాత్రులను కోదాడ ఏరియా ఆస్పత్రికి తరలింపు ప్రమాద సమయంలో బస్సులో 42 మంది ప్రయాణికులు . హైద్రాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్ బస్సు వెనక నుండి కంటైనర్ ను బలంగా ఢీకొట్టడంతో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, అత్యవసర సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని బస్సులో చిక్కుకున్న క్షతగాత్రులను బయటకు తీసి చికిత్స కోసం సమీపంలోని కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతులు, క్షతగాత్రుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST
