మహిళల ఆత్మగౌరవమే లక్ష్యంగా సంక్షేమ పాలన….
రామగుండంలో మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ….
సాక్షిత పెద్దపల్లి-జిల్లా ప్రతినిధి,రామగుండం/ : రామగుండం నియోజకవర్గంలో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 23వ డివిజన్ మాతంగి కాలనీ, కాజిపల్లిలో మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు.
23వ డివిజన్ కార్పొరేటర్ బెంద్రం సునీత రాజిరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమానికి ఎమ్మెల్యే సతీమణి శ్రీమతి మనాలి ఠాకూర్, నగర మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతిపల్లి ఎల్లన్న, 36వ డివిజన్ అధ్యక్షులు రంజిత్ తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మహిళలకు ఇందిరమ్మ చీరలను అందజేసి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మహిళల సంక్షేమం, ఆత్మగౌరవం, అభివృద్ధి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాలను నాయకులు వివరించారు.
మనాలి ఠాకూర్ మాట్లాడుతూ మహిళల సంక్షేమం, ఆత్మగౌరవాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు రామగుండం నియోజకవర్గంలో ప్రజా సంక్షేమ కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తున్నామని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని పేర్కొన్నారు.
కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST
