మాజీ కార్పొరేటర్ గుడిమెట్ల సురేష్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిశారు

Sakshitha news

130 డివిజన్ సూరారం మాజీ కార్పొరేటర్ గుడిమెట్ల సురేష్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని శంభీపూర్ లోని కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా కేక్ కట్ చేసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ, పాక్స్ చైర్మన్ మిద్దెల బాల్ రెడ్డి, తాజా మాజీ కౌన్సిలర్లు శ్రీనివాస్ రెడ్డి, మురళి యాదవ్, సీనియర్ నాయకులు పోలీస్ గోవింద్ రెడ్డి, మరియు నాయకులు తదితరులు పాల్గొన్నారు..

Scroll to Top