బోనాల పండుగ సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్న కొలన్ హన్మంత్ రెడ్డి

Sakshitha news

||బోనాల పండుగ సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్న నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ||

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగ సందర్భంగా నియోజకవర్గంలోని బాచుపల్లి డబుల్ బెడ్ రూమ్ పరిధిలో మరియు రాజీవ్ గాంధీ నగర్ ప్రాంతాల్లోని శ్రీశ్రీశ్రీ ఎల్లమ్మ మరియు శ్రీ శ్రీ శ్రీ నల్ల పోచమ్మ తల్లి ఆలయాల్లో నిర్వహించిన బోనాల ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, ఆనందంగా జీవించాలని, నియోజకవర్గంలో శాంతి, అభివృద్ధి, సౌభ్రాతృత్వం మరింతగా వెల్లివిరియాలని కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి గారు అమ్మవారిని ప్రార్థించారు.

ఈ సందర్భంగా హన్మంతన్న మాట్లాడుతూ, బోనాల పండుగ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి, ఘనమైన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. తరతరాలుగా కొనసాగుతున్న ఈ పవిత్ర పండుగను ప్రతి ఒక్కరూ భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమాల్లో సీనియర్ కాంగ్రెస్ నాయకులు, డివిజన్ అధ్యక్షులు, మహిళా నాయకులు, యువజన నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ఆలయ కమిటీ సభ్యులు మరియు స్థానిక ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు

Scroll to Top